రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలలో 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది.
అలర్ట్: బయటకు వెళ్తే.. గొడుగు తీసుకెళ్లడం మరవద్దు..!!
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వలన రాగల 48 గంటలలో దక్షిణ ఒరిశా తీరానికి దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం.. దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు.
బుధవారం ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్-పట్టణం, వరంగల్-గ్రామీణం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో బుధవారం ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.