Telangana Rain Updates : ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్‌పై సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి.. నైరుతి దిశకు తిరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది.
రాష్ట్రంలో రెండ్రోజులుగా భారీ వర్షాలు.. నేడూ, రేపూ అదే పరిస్థితి..! - telangana weather report
Telangana Rain Updates : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే నేడూ, రేపూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు అత్యధికంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 13.2 సెంటీమీటర్లు, పాతరాజంపేట(కామారెడ్డి)లో 12.8, పొచ్చెర(ఆదిలాబాద్)లో 10.4. నెన్నెల(మంచిర్యాల)లో 9.7, సోనాల(ఆదిలాబాద్)లో 9.4, జైనూర్(ఆసిఫాబాద్)లో 9.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ హైదరాబాద్ నగరంతో పాటు సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు అధికంగా కురిశాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 686 అడుగులకు చేరింది.