పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణం, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు - భారీ వర్షాలు తాజా వార్తలు
రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడటం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కొనసాగుతోన్న అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారిందని పేర్కొంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ.. నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని వివరించారు.