తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES : హైదరాబాద్‌లో ఈ రాత్రంతా వర్షం కురిసే అవకాశం: వాతావరణశాఖ

Rains
Rains

By

Published : Jul 26, 2023, 7:02 AM IST

Updated : Jul 26, 2023, 10:43 PM IST

22:42 July 26

అడవిలో చిక్కుకున్న పర్యాటకులను కాపాడుతాం: ములుగు ఎస్పీ

  • అడవిలో చిక్కుకున్న పర్యాటకులను కాపాడుతాం: ములుగు ఎస్పీ
  • డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి: ఎస్పీ
  • అడవిలో చిక్కుకున్న సందర్శకులతో ఫోన్‌లో మాట్లాడిన ఎస్పీ
  • వాగు దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని హెచ్చరించిన ఎస్పీ
  • రెస్క్యూ బృందాలు కాపాడతాయని చెప్పిన ఎస్పీ గౌష్‌ ఆలం
  • ఆహార పదార్థాలు, రక్షణ పరికరాలు పంపిస్తున్నట్లు చెప్పిన ఎస్పీ

22:33 July 26

  • సికింద్రాబాద్‌: బోయిన్‌పల్లి, మారేడుపల్లి, చిలకలగూడలో వర్షం
  • సికింద్రాబాద్‌: ప్యాట్నీ, తిరుమలగిరి, అల్వాల్ ప్రాంతాల్లో వర్షం సికింద్రాబాద్‌: పారడైజ్, బేగంపేట్ ప్రాంతాల్లో వర్షం

22:10 July 26

హైదరాబాద్‌లో ఈ రాత్రంతా వర్షం కురిసే అవకాశం: వాతావరణశాఖ

  • హైదరాబాద్‌లో ఈ రాత్రంతా వర్షం కురిసే అవకాశం: వాతావరణశాఖ
  • అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం
  • హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం
  • అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు భారీ, అతిభారీ వర్షం కురిసే అవకాశం
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

22:10 July 26

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం: రాత్రి 9 గం.కు 48 అడుగులకు చేరిన నీటిమట్టం
  • భద్రాచలం: రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • భద్రాచలం వద్ద గోదావరిలో 11.11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

21:30 July 26

కారేపల్లిలో కస్తూరిబా గాంధీ విద్యాలయంలోకి చేరిన వరదనీరు

  • ఖమ్మం: కారేపల్లిలో కస్తూరిబా గాంధీ విద్యాలయంలోకి చేరిన వరదనీరు
  • భయాందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధన సిబ్బంది

21:29 July 26

ములుగు జిల్లాలో అడవిలో చిక్కుకున్న పర్యాటకులు

  • ములుగు జిల్లాలో అడవిలో చిక్కుకున్న పర్యాటకులు
  • ఉదయం ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లిన పర్యాటకులు
  • సాయంత్రం తిరిగివస్తుండగా మార్గమధ్యలో ఉప్పొంగిన వాగు
  • వాగు పొంగడంతో అడవిలో ఉండిపోయిన 60 మంది పర్యాటకులు
  • డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చిన పర్యాటకులు
  • పర్యాటకులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు

21:29 July 26

కారేపల్లి మండలంలో భారీ వర్షం

  • ఖమ్మం: కారేపల్లి మండలంలో భారీ వర్షం
  • పేరుపల్లి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బుగ్గవాగు
  • బుగ్గవాగు ఒడ్డునే ఉన్న 90 రెండుపడక గదుల ఇళ్లు
  • వరద నీరు ఇళ్లల్లోకి చేరుతుందేమోనని భయాందోళన
  • ఏటా వరదలు పెరిగిప్పుడు ప్రభుత్వ ఇళ్లల్లోకి చేరుతున్న వరదనీరు

21:28 July 26

నామాలపాడు వాగులో నిలిచిన ఆర్టీసీ బస్సు

  • ఖమ్మం: నామాలపాడు వాగులో నిలిచిన ఆర్టీసీ బస్సు
  • ఖమ్మం: ఇంజిన్‌లోకి నీళ్లు వెళ్లి వాగులో ఆగిపోయిన ఆర్టీసీ బస్సు
  • ఖమ్మం: బస్సులో ఉన్న ప్రయాణికులను రక్షించిన పోలీసులు

20:38 July 26

ఏ క్షణంలోనైనా శ్రీరాంసాగర్ గేట్లు ఎత్తే అవకాశం: ఎస్‌ఆర్‌ఎస్పీ ఈఈ

  • ఏ క్షణంలోనైనా శ్రీరాంసాగర్ గేట్లు ఎత్తే అవకాశం: ఎస్‌ఆర్‌ఎస్పీ ఈఈ
  • ఎగువ నుంచి ఎస్‌ఆర్‌ఎస్పీకి భారీగా వరద: ప్రాజెక్టు ఈఈ
  • ఏ క్షణంలోనైనా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీరు వదిలే అవకాశం:ఈఈ
  • శ్రీరాంసాగర్ దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఆర్‌ఎస్పీ ఈఈ
  • నదీ పరివాహక ప్రాంతంలోకి ఎవరూ వెళ్లవద్దు: ఎస్‌ఆర్‌ఎస్పీ ఈఈ
  • నదివైపు పశువులు, గొర్రెలు వెళ్లకుండా చూసుకోవాలి: ఎస్‌ఆర్‌ఎస్పీ ఈఈ

20:09 July 26

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం వద్ద గోదావరిలో 11.11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
  • భద్రాచలం: రాత్రి 7 గం.కు 47.3 అడుగులకు చేరిన నీటిమట్టం
  • భద్రాచలం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

20:03 July 26

రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా సీఎస్, డీజీపీ సమీక్ష

  • రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా సీఎస్, డీజీపీ సమీక్ష
  • ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్‌ శాంతికుమారి
  • కలెక్టర్లు, ఎస్పీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్న సీఎస్‌ శాంతికుమారి
  • ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చర్యలు చేపట్టాలని కోరిన సీఎస్‌
  • ప్రాజెక్టులు, చెరువులు, కాల్వలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయన్న సీఎస్‌
  • లోతట్టుప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం
  • పునరావాస కేంద్రాల్లో అవసరమైన సామగ్రి ఉండేలా చూడాలన్న సీఎస్‌

19:47 July 26

ముల్కలపల్లి మం. కుమ్మరిపాడు వద్ద మహిళ గల్లంతు

  • కొత్తగూడెం: ముల్కలపల్లి మం. కుమ్మరిపాడు వద్ద మహిళ గల్లంతు
  • పాములేరు వాగు దాటుతుండగా కురసం సీత అనే మహిళ (60) గల్లంతు
  • వరినాట్లకు వెళ్లి వస్తూ లెవల్ చాప్టర్‌ దాటుతుండగా ఘటన
  • 10 మంది కూలీలు వాగు దాటుతుండగా ఘటన, మహిళ కోసం గాలింపు

19:17 July 26

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం వద్ద గోదావరిలో 10.83 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
  • భద్రాచలం: రాత్రి 7 గం.కు 46.7 అడుగులకు చేరిన నీటిమట్టం
  • భద్రాచలం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

19:17 July 26

వర్షాలు పడినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్న జీహెచ్‌ఎంసీ

  • వర్షాలు పడినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్న జీహెచ్‌ఎంసీ
  • ఇంట్లో ఉన్న స్విచ్‌ బోర్డులను తడి చేతులతో ముట్టుకోవద్దు: జీహెచ్‌ఎంసీ
  • అత్యవసరమైతే తప్ప ఇంటినుంచి బయటకు రావద్దు: జీహెచ్‌ఎంసీ
  • కరెంట్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలి: జీహెచ్‌ఎంసీ
  • వర్షంలో వాహనాలు జారే ప్రమాదం ఉంది.. మెల్లగా వెళ్లాలి..: జీహెచ్‌ఎంసీ
  • డ్రైవింగ్ సమయంలో హెడ్‌లైట్లు ఆన్ చేసి ఉంచాలి: జీహెచ్‌ఎంసీ

18:56 July 26

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం

  • పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
  • ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు
  • దక్షిణ, మధ్య, పశ్చిమ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు
  • నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ
  • ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ
  • సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
  • ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • వివరాలు వెల్లడించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న

18:54 July 26

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం వద్ద గోదావరిలో 10.59 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
  • సాయంత్రం 6 గం.కు 46.3 అడుగులకు చేరిన నీటిమట్టం

18:09 July 26

వివిధ జిల్లాల్లో వర్షాలు, వరద పరిస్థితిపై సమీక్షించిన సీఎస్‌

  • ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్‌
  • కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్
  • వివిధ జిల్లాల్లో వర్షాలు, వరద పరిస్థితిపై సమీక్షించిన సీఎస్‌
  • సమీక్షలో పాల్గొన్న డీజీపీ, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి

18:09 July 26

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • సాయంత్రం 5 గం.కు 45.2 అడుగులకు చేరిన నీటిమట్టం
  • భద్రాచలం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

18:08 July 26

భారీ వర్షసూచన దృష్ట్యా అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు

  • భారీ వర్షసూచన దృష్ట్యా అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు
  • ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు
  • వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం పరిశీలించాలని ఐటీ కంపెనీలకు సూచన
  • వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వీలుకాకుంటే పనివేళల్లో మార్పులు చేపట్టాలని సూచన
  • రేపట్నుంచి 5 రోజులపాటు పనివేళలు మార్చాలని ట్రాఫిక్‌ పోలీసుల సూచన
  • ఐటీ ఉద్యోగులకు 3 దశల్లో విధుల ముగింపు వేళలు ఉండాలని సూచన

17:14 July 26

హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం

  • హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం
  • హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ
  • హైదరాబాద్‌వాసులను అప్రమత్తం చేసిన జీహెచ్‌ఎంసీ
  • సాయం కోసం 9000113667 నెంబర్‌కు సంప్రదించాలన్న జీహెచ్‌ఎంసీ
  • అవసరం లేకుండా బయటకు రావద్దన్న జీహెచ్‌ఎంసీ

16:49 July 26

జనగామ జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

  • జనగామ జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
  • సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, కలెక్టర్ శివలింగయ్య
  • మాతా, శిశు ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి

16:38 July 26

టేకులపల్లి మం. సంపత్‌నగర్ వద్ద రోడ్డుపై పుణ్యపు వాగు ప్రవాహం

  • కొత్తగూడెం: టేకులపల్లి మం. సంపత్‌నగర్ వద్ద రోడ్డుపై పుణ్యపు వాగు ప్రవాహం
  • పుణ్యపు వాగు ఉద్ధృతి వల్ల పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • ఆళ్లపల్లి మం. రాయపాడులో వంతెన పైనుంచి కిన్నెరసాని వాగు ప్రవాహం
  • కిన్నెరసాని వాగు ఉద్ధృతితో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

16:38 July 26

రేపు, ఎల్లుండి డిప్లొమా అడ్మిషన్ల్ కౌన్సెలింగ్‍ వాయిదా

  • రేపు, ఎల్లుండి డిప్లొమా అడ్మిషన్ల్ కౌన్సెలింగ్‍ వాయిదా
  • భారీ వర్షాల వల్ల వాయిదా వేసిన జయశంకర్ వ్యవసాయ వర్సిటీ

15:53 July 26

ఖానాపురం మండలం మంగళవారంపేటలో భారీ వర్షం

  • వరంగల్: ఖానాపురం మండలం మంగళవారంపేటలో భారీ వర్షం
  • భారీ వర్షాలకు కూలిన 4 ఇళ్లు, పరిశీలించిన ఐటీడీఏ పీవో అంకిత్

15:25 July 26

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • మధ్యాహ్నం 3 గం.కు 44.4 అడుగులకు చేరిన నీటిమట్టం
  • భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

14:52 July 26

తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు

  • తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు
  • తాలిపేరు దిగువప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌
  • తాలిపేరు నుంచి దిగువకు 2 లక్షల క్యూసెక్కులు విడుదల: కలెక్టర్‌
  • లోతట్టుప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశం
  • ముంపుప్రాంత గ్రామాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న కలెక్టర్ ప్రియాంక
  • భద్రాచలం-చర్ల రోడ్డుపై రాకపోకలు నియంత్రించాలని కలెక్టర్ ఆదేశం
  • అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయాలన్న కలెక్టర్‌ ప్రియాంక

14:51 July 26

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద ప్రవాహం

  • నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1,16,293 క్యూసెక్కుల ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,086.2 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 70.67 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు

14:50 July 26

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పెరిగిన వరద ప్రవాహం

  • కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పెరిగిన వరద ప్రవాహం
  • నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కుల ప్రవాహం
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1401.91 అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,405 అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 13.57 టీఎంసీల నీరు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు

14:49 July 26

  • వరంగల్ నగరంలో భారీ వర్షం

14:49 July 26

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • కొత్తగూడెం: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • మధ్యాహ్నం 2 గం.కు 43.5 అడుగులకు చేరిన నీటిమట్టం

13:46 July 26

పెద్దపల్లి: సబితం జలపాతంలో దిగి యువకుడు మృతి, ఇద్దరు గల్లంతు

  • కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన మానుపాటి వెంకటేశ్‌ మృతి
  • పెద్దపల్లి: స్నేహితులతో కలసి సబితం జలపాతానికి వెళ్లిన వెంకటేశ్‌
  • గల్లంతైన యువకుల కోసం గాలిస్తున్న పోలీసులు, స్థానికులు

13:04 July 26

నగరవాసులను అప్రమత్తం చేసిన జీహెచ్​ఎంసీ... సాయంత్రం వరకు భారీ వర్షం

  • హైదరాబాద్‌వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం
  • హైదరాబాద్‌వాసులను అప్రమత్తం చేసిన జీహెచ్‌ఎంసీ
  • సాయంత్రం వరకు భారీవర్షం కురిసే అవకాశం ఉందన్న జీహెచ్‌ఎంసీ
  • సాయం కోసం 9000113667 నెంబర్‌కు సంప్రదించాలన్న జీహెచ్‌ఎంసీ
  • ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
  • జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
  • కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
  • భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • నల్గొండ, యాదాద్రిలో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • నిజామాబాద్, వరంగల్‌ జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • హనుమకొండ, జనగామ జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • సిద్దిపేట, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • గద్వాల్‌, నాగర్‌కర్నూలు జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

12:38 July 26

జీహెచ్‌ఎంసీ అల్వాల్‌ ఆఫీసుకు పామును తీసుకొచ్చిన వ్యక్తి

  • అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా పామును తీసుకొచ్చిన వ్యక్తి
  • ఇళ్లలోకి మురుగు నీరు వస్తుందని ఫిర్యాదు చేసిన బాధితుడు
  • ఫిర్యాదు చేసి గంటలు గడిచినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం
  • ఇంట్లోకి వచ్చిన పామును డబ్బాలో పట్టి ఆఫీసుకు తెచ్చిన బాధితుడు
  • జీహెచ్‌ఎంసీ వార్డు అధికారి టేబుల్‌పై పామును వదిలిన బాధితుడు

12:29 July 26

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద

  • నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద
  • శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.16,293 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు
  • శ్రీరాంసాగర్‌లో ప్రస్తుతం 1085.70 అడుగుల నీటిమట్టం
  • శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్‌లో ప్రస్తుతం నీటినిల్వ 69.072 టీఎంసీలు

12:28 July 26

భద్రాద్రి వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • మధ్యాహ్నం 12 గంటలకు 41.8 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి

12:13 July 26

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. 70లక్షల మందికి ఎస్​ఎమ్​ఎస్

  • అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న జీహెచ్‌ఎంసీ అధికారులు
  • 70లక్షల మందిని ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా అప్రమత్తం చేసిన అధికారులు

12:07 July 26

రాష్ట్రంలో ఇవాళ, రేపు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

  • ఏపీ, ఒడిశా తీరంలో స్థిరంగా ఉన్న తీవ్ర అల్పపీడనం
  • తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఆవర్తనం
  • ఇవాళ, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
  • రాష్ట్రంలో ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ఇవాళ, రేపు, ఎల్లుండి 40-50కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం

11:51 July 26

వరదలో అంత్యక్రియల కోసం అష్టకష్టాలు.. నడుములోతు నీటిలో..

  • సిద్దిపేట జిల్లా: వరదలో అంత్యక్రియల కోసం అష్టకష్టాలు
  • చేర్యాల మం. వేచరేణిలో నిన్న అనారోగ్యంతో బాలయ్య మృతి
  • వైకుంఠ ధామానికి తీసుకెళ్లేందుకు బంధువుల అవస్థలు
  • సిద్దిపేట జిల్లా: మృతదేహాన్ని వాగు దాటించేందుకు బంధువుల కష్టాలు
  • నడుములోతు నీటిలో మృతదేహాన్ని వాగు దాటించిన బంధువులు
  • సిద్దిపేట జిల్లా: వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్న గ్రామస్తులు

11:46 July 26

భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు

  • వర్షానికి సింగరేణిలో 2, 3 ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
  • భూపాలపల్లి: ఘనపూర్‌లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మోరంచ వాగు
  • కొండాపురం, అప్పయ్యపల్లి, సితరంపుర్ గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • బుద్దారం గ్రామంలో అలుగు పోస్తున్న వంగపల్లి చెరువు
  • టేకుమట్ల మండలం వేలిశాలలో మత్తడి పోస్తున్న చెరువు
  • పెద్దంపల్లి, అషిరెడ్డిపల్లిలో ఇళ్లలోకి చేరిన వరద నీరు
  • సుల్తాన్‌పుర్, గోరికొత్తపల్లి గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం

11:44 July 26

మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద.. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల

  • నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉద్ధృతి
  • 5 గేట్ల మూడు అడుగులు ఎత్తి 9,417 క్యూసెక్కులు విడుదల
  • మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 642.50 అడుగులు
  • మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు
  • మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు
  • మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 3.81 టీఎంసీలు
  • మూసీ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 13,259 క్యూసెక్కులు
  • మూసీ ప్రాజెక్టు ఔట్ ఫ్లో 9,790 క్యూసెక్కులు

11:06 July 26

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. నేడు, రేపు భారీ వర్షాలు

  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న బలమైన అల్పపీడనం
  • ఉత్తర కోస్తాంధ్ర - ఒడిశా తీరాన్ని ఆనుకుని బలమైన అల్పపీడనం
  • అనుబంధంగా కొనసాగుతున్న రుతుపవన ద్రోణి, ఉపరితల అవర్తనం
  • రేపటివరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన: ఐఎండీ

10:20 July 26

ఎగువ మానేరులోకి భారీగా వరద ప్రవాహం

  • సిరిసిల్ల: ఎగువ మానేరులోకి భారీగా వరద ప్రవాహం
  • సిరిసిల్ల: 32 అడుగులకు చేరి పొంగిపొర్లుతున్న ఎగువ మానేరు

10:19 July 26

భారీ వర్షాల దృష్ట్యా అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్‌ సమావేశం

  • మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లా అధికారులతో సమావేశం
  • కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్
  • వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యవతి సూచన

10:16 July 26

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా జోరు వానలు

  • తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద, 24 గేట్లు ఎత్తివేత
  • తాలిపేరు ప్రాజెక్టు నుంచి 1.80 లక్షల క్యూసెక్కులు విడుదల
  • ఖమ్మం: పూర్తిస్థాయిలో నిండిన వైరా రిజర్వాయర్
  • ఖమ్మం: అలుగు పారుతున్న సత్తుపల్లి దామరచెరువు
  • ఖమ్మం: అలుగు పారుతున్న సింగభూపాలెం చెరువు
  • ఖమ్మం: పాలేరు జలాశయానికి మరింత పెరిగిన వరద
  • పాలేరు జలాశయం నుంచి 24 గేట్లు ఎత్తి నీరు విడుదల
  • ఖమ్మం: మున్నేరు ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద
  • మణుగూరు ఓసీ గనుల్లో వర్షం వల్ల ఉత్పత్తికి అంతరాయం
  • ఖమ్మం: పెదవాగు ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద నీరు
  • పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి 2749 క్యూసెక్కులు విడుదల

10:15 July 26

రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

  • ఇవాళ, రేపు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ఇవాళ హైదరాబాద్‌ సహా రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం
  • తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం

10:15 July 26

పోటెత్తిన అల్లివాగు... నీట మునిగిన ఇళ్లు

  • ములుగు జిల్లా వాజేడు మండలంలో పోటెత్తిన అల్లివాగు
  • ములుగు: భారీ వర్షాలకు నీట మునిగిన ఇళ్లు
  • బాధితులను పునరావాస కేంద్రానికి తరలించిన అధికారులు
  • ములుగు: భారీ వర్షాలకు తిమ్మంపేటలో మత్తడిపోస్తున్న పెద్ద చెరువు

09:41 July 26

భారీ వర్షాల కారణంగా కేయూలో జరగాల్సిన పరీక్షలు వాయిదా

  • నేడు, రేపు కాకతీయ వర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా
  • భారీ వర్షాల కారణంగా పరీక్షలు వాయిదా వేసిన వర్సిటీ అధికారులు
  • వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ త్వరలో ప్రకటిస్తామని వెల్లడి

09:36 July 26

భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • ఉదయం 8 గం.కు 39.6 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి

08:29 July 26

కొత్తగూడెం: తాలిపేరు ప్రాజెక్టుకు చేరుతున్న వరదనీరు

  • ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు చేరుతున్న వరద
  • తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 1,15,956 క్యూసెక్కులు విడుదల

08:29 July 26

వర్షం కారణంగా నిలిచిన బొగ్గు ఉత్పత్తి

  • ఇల్లెందు, కోయగూడెం ఉపరితల గనులలో పూర్తిగా నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • వర్షాలకు నిలిచిన 36 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత
  • కోయగూడెం ఉపరితల గని ప్రాంతంలో 28 మి.మీ వర్షపాతం
  • పెద్దపల్లి: రామగుండంలో 4 ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • పెద్దపల్లి: మోటర్ల సహయంతో నీటిని బయటకు పంపుతున్న అధికారులు

08:28 July 26

నారాయణపేట జిల్లాలో వర్షానికి కూలిన రెండు ఇళ్లు

  • మక్తల్ మం. బుత్పుర్‌ గ్రామంలో వర్షానికి కూలిన ఇళ్లు
  • నారాయణపేట: ఇళ్లు కూలినఘటనలో పలువురికి స్వల్పగాయాలు

07:53 July 26

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీ.. రుద్రవెల్లి, జూలూరు మధ్య రాకపోకలు నిలిపివేత

  • యాదాద్రి: బీబీనగర్‌లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
  • యాదాద్రి: రుద్రవెల్లి వద్ద లోలేవల్‌ బ్రిడ్జి పైనుంచి ఉద్ధృతంగా మూసీ
  • యాదాద్రి: రుద్రవెల్లి, జూలూరు మధ్య రాకపోకలు నిలిపివేత
  • యాదాద్రి: భీమలింగం వద్ద లోలెవల్ వంతెనపై నుంచి ప్రవహిస్తున్న మూసీ
  • మూసీ నది వరద కారణంగా రాకపోకలకు అంతరాయం

07:53 July 26

పార్వతి బ్యారేజీ 44 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీరు విడుదల

  • పెద్దపల్లి: పార్వతి బ్యారేజీకి కొనసాగుతున్న వరద ప్రవాహం
  • పార్వతి బ్యారేజీ 44 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీరు విడుదల
  • పార్వతి బ్యారేజీ ఇన్‌ఫ్లో 1,21,779 క్యూసెక్కులు
  • పార్వతి బ్యారేజీ ఔట్‌ఫ్లో 1,21,779 క్యూసెక్కులు
  • పార్వతి బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 8.83 టీఎంసీలు
  • పార్వతి బ్యారేజీ ప్రస్తుత నీటిమట్టం 3.711 టీఎంసీలు

07:52 July 26

శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల

  • పెద్దపల్లి: శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద
  • శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల
  • శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 99,079 క్యూసెక్కులు
  • శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 1,20,107 క్యూసెక్కులు
  • శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 20 టీఎంసీలు
  • శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 16.4883 టీఎంసీలు

07:51 July 26

ములుగు జిల్లా మల్లూరులో 14.18 సెం.మీ. వర్షపాతం

  • రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 14.95సెం.మీ. వర్షపాతం
  • ములుగు జిల్లా మల్లూరులో 14.18 సెం.మీ. వర్షపాతం
  • ములుగు జిల్లా మంగాపేటలో 12.63 సెం.మీ. వర్షపాతం
  • వనపర్తి జిల్లా పెబ్బేరులో 9.35 సెం.మీ. వర్షపాతం
  • భద్రాద్రి జిల్లా కరకగూడెంలో 8.23 సెం.మీ. వర్షపాతం

06:57 July 26

శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులలోకి పోటెత్తుతున్న భారీ వరద

  • నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద
  • శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 87,220 క్యూసెక్కులు
  • శ్రీరామ్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు
  • శ్రీరామ్‌సాగర్‌లో ప్రస్తుతం 1086 అడుగుల నీటిమట్టం
  • శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు
  • శ్రీరామ్‌సాగర్‌లో ప్రస్తుతం నీటినిల్వ 66.526 టీఎంసీలు
  • కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం
  • నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతున్న 12,600 క్యూసెక్కులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1401.30 అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1405 అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 12.833టీఎంసీలు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 17.80 టీఎంసీలు

06:56 July 26

వర్షాల దృష్ట్యా ఐటీ కంపెనీలకు పోలీసుల సూచన

  • హైదరాబాద్ : ఇవాళ ఐటీ ఉద్యోగులు 3 విడతల్లో లాగౌట్‌ చేయాలని సూచన
  • ఐకియా-సైబర్‌ టవర్స్ వరకు ఐటీ ఆఫీసుల్లో మ.3 గం.కు లాగౌట్‌ చేయాలని సూచన
  • ఐకియా-బయోడైవర్సిటీ వరకు ఐటీ ఆఫీసుల్లో సా.4.30కు లాగౌట్ చేయాలని సూచన
  • ఐకియా-రాయదుర్గం వరకు ఐటీ ఆఫీసుల్లో సా.4.30కు లాగౌట్‌ చేయాలని సూచన
  • ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐటీ ఆఫీసుల్లో మ.3-సా.6 మధ్య లాగౌట్‌ చేయాలని సూచన
  • గచ్చిబౌలిలోని ఐటీ ఆఫీసుల్లో మ.3-సా.6 మధ్య లాగౌట్‌ చేయాలని సూచన
  • హైదరాబాద్‌: భారీగా ట్రాఫిక్‌జామ్‌ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు సూచన

06:44 July 26

Rains in Telangana Today Live Updates : రాష్ట్రంలో నేడు, రేపు, అన్ని విద్యాసంస్థలకు సెలవులు

రాష్ట్రంలో నేడు, రేపు, అన్ని విద్యాసంస్థలకు సెలవులు

  • భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవులు
  • విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ ఆదేశం
  • నేడు, రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసిన యూనివర్సిటీలు
  • మూడు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
  • నేడు, రేపు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
  • నేడు హైదరాబాద్‌ సహా రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం
  • అత్యవసరమైతే ప్రజలు బయటకు రావాలని వాతావరణశాఖ సూచన
  • పురపాలకశాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూం: ప్రభుత్వం
Last Updated : Jul 26, 2023, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details