తెలంగాణ

telangana

ETV Bharat / state

Weather Report : రెడ్​ అలర్ట్​.. నేటి నుంచి 3 రోజులు అతి భారీ వర్షాలు - weather report telangana

telangana weather report: రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకులు నాగరత్న తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్​ హెచ్చరిక జారీ చేసినట్లు ఆమె వివరించారు.

Weather Report
Weather Report

By

Published : Aug 7, 2022, 6:38 AM IST

Updated : Aug 7, 2022, 7:21 AM IST

telangana weather report: బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఆదివారానికి అది మరింత తీవ్రమయ్యే సూచనలున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రెడ్‌ అలర్ట్‌ హెచ్చరిక జారీ చేసినట్లు ఆమె చెప్పారు. అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించిందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు.

కొన్ని ప్రాంతాల్లో కొద్ది గంటల్లోనే కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఆమె వివరించారు. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా అక్కెనపల్లి(పెద్దపల్లి జిల్లా), పాత మంచిర్యాలలో 9.2, వంకులం(కుమురంభీం)లో 7.3, అర్నకొండ(కరీంనగర్‌)లో 6.1, కారేపల్లి(ఖమ్మం)లో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రత సాధారణంకన్నా 3 డిగ్రీల వరకూ తగ్గడంతో చల్లని వాతావరణం ఏర్పడింది.

Last Updated : Aug 7, 2022, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details