రాష్ట్రంలోని ఒకట్రెండు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న వెల్లడించారు. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొన్నారు.
Rains: తెలంగాణలో రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు - Telangana weather updates
తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.
భారీ వర్షాలు
ఈరోజు రాష్ట్రంలో కింది స్థాయిలో గాలులు, పశ్చిమ, వాయవ్య దిశల నుంచి వీస్తున్నాయని నాగరత్న తెలిపారు. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 0.9 కి.మీ నుంచి 2.1 కి.మీ వరకు వ్యాపించి ఉన్నట్లు సంచాలకురాలు వివరించారు.
ఇదీ చదవండి: Webinar:ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రజాద్రోహానికి ఒడిగట్టారు