Heavy Rains in Nellore: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, పెన్నా వరదతో ఆత్మకూరు చెరువును తలపిస్తోంది. ఇళ్లు నీటమునగడంతో... ప్రజలు తీవ్ర అపస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న గిరిజనుల పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఎడతెరిపి లెకుండ కురుస్తున్న వర్షాలకు ఎటు చూసిన నీరె (Flood Effect in Nellore) కనిపిస్తుంది. ఎక్కడ చూసిన వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చేజేర్ల, అనంతసాగరం, ఏఎస్పేట మండలాల్లో వాగులు పొంగుతుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు గూడూరు ఆర్టీసీ బస్టాండ్ చెరువులా మారింది. చేజర్ల మండలం నాగుల వెల్లటూరు, పాతపాడు చెరువులకు గండ్లు పడ్డాయి. అప్రమత్తమైన అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.
సోమశిలకు కొనసాగుతున్న వరద ప్రవాహం
భారీ వర్షాలతో సోమశిల జలశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశం ఇన్ ఫ్లో 95,266 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,16,146 క్యూసెక్కులు ఉంది. సోమశిల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 68.37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి భారీ వరదల దృష్ట్యా పెన్నా పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.