తెలంగాణ

telangana

ETV Bharat / state

Rains: హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వర్షం... వాహనదారుల ఇక్కట్లు - Telangana rains

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం (Rain) కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవగా వాహనదారులు తడిసి ముద్దయ్యారు.

పలు ప్రాంతాల్లో వర్షం
పలు ప్రాంతాల్లో వర్షం

By

Published : Jun 15, 2021, 10:45 PM IST

హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వర్షం...

ఎండ తీవ్రత వల్ల ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ ప్రజలు ఉపశమనం పొందారు. ఉదయం నుంచి వేడిగా ఉన్న వాతావరణం... సాయంత్రానికి కురిసిన జోరువాన (Rain)తో చల్లబడింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా... వాహనదారులు తడిసిముద్దయ్యారు. అబిడ్స్, బషీర్​బాగ్, కింగ్ కోఠి, లిబర్టీ, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Rain) కురిసింది.

నాంపల్లిలోని పలు కాలనీలలో భారీ వర్షానికి రోడ్లపై భారీగా నీరు చేరింది. ఓల్డ్ బోయిన్​పల్లి చౌరస్తాలో వర్షం దాటికి భారీ వృక్షం నెలకొరిగింది. మరో రెండు విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయాయి. లాక్​డౌన్ కారణంగా రోడ్లపై ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. జీహెచ్ఎంసీ సిబ్బంది వృక్షాన్ని తొలగించారు.

ఇదీ చూడండి:Inter: జులై 1 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆన్‌లైన్ తరగతులు

ABOUT THE AUTHOR

...view details