అరేబియా సముద్రంలో ఏర్పడిన భీకర తుపాను తౌక్టే ప్రభావం వల్ల హైదరాబాద్ నగరంలో ఈ ఉదయం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడజాగీర్, కిస్మత్‌పుర్, గండిపేట్, గగన్‌పహాడ్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, వనస్థలిపురం, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, కృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురిశాయి.
'తౌక్టే' ఎఫెక్ట్: హైదరాబాద్‌లో పలుచోట్ల ఉరుములు, మెరుపుల వర్షం - telangana rains news
తౌక్టే తుపాను ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన ప్రజలు ఇబ్బందులుపడ్డారు.
నగరంలో వర్షం
సైదాబాద్ పరిసర ప్రాంతాలు, సికింద్రాబాద్, తార్నాక, నాచారం, మల్లాపూర్, నాగారం, జీడిమెట్ల, సూరారం, ఈసీఐఎల్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లాక్‌డౌన్ వేళ నిత్యవసరాల కోసం ఇళ్ల నుంచి బయటికి వచ్చిన ప్రజలు ఇబ్బందులుపడ్డారు.
ఇదీ చూడండి: కనికరం చూపని కన్నబిడ్డలు.. ప్రాణగండంతో వృద్ధురాలు
Last Updated : May 18, 2021, 8:02 AM IST