హైదరాబాద్‌లో రాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా నీరు ప్రవహించింది. ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్, ఉప్పల్‌లో భారీ వర్షం కురిసింది. బాలానగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చింతల్, జగద్గిరిగుట్ట, కొంపల్లి, సుచిత్ర, గాజులరామారం, సనత్‌నగర్, బోయిన్‌పల్లిలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మాదాపూర్‌లో అత్యధికం..
పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్, కుషాయిగూడ, చర్లపల్లిలో రహదారులపై నీరు నిలిచింది. పలుచోట్ల ద్విచక్రవాహనదారులు వంతెనల కింద వాహనాలు నిలిపి వేచిచూశారు. రాత్రి పూట ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి 11గంటల వరకు అత్యధికంగా మాదాపూర్ ప్రాంతంలో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాప్రాలో 10.3, ఉప్పల్‌లో 9.3, బాలానగర్ 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు చేపట్టాయి.
హోర్డింగ్ కుప్పకూలి..