ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడురోజులుగా రాష్ట్రంలో(rains in telangana) విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జోరువానలతో భాగ్యనగరం తడిసిముద్దవుతోంది. గంటపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సోమాజిగూడ, ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బేగంబజార్, బషీర్‌బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ట్యాంక్‌బండ్, కూకట్‌పల్లి, బాలానగర్, చింతల్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, కొంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
HYD RAINS: హైదరాబాద్‌లో భారీ వర్షం... స్తంభించిన జనజీవనం - తెలంగాణ వార్తలు
భాగ్యనగరంలో జోరువాన(hyderabad rains) కురుస్తోంది. నగరంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. వివిధ ప్రాంతాల్లో ఏకధాటి వర్షం కురిసి... రహదారులపై నీరు చేరింది. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.
ఏకధాటి వర్షంతో రహదారులపై భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఖైరతాబాద్ - బంజారాహిల్స్ రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కాగా.. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ కూరుకుపోవడంతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీరు ఖైరతాబాద్ రహదారి పైన నిలిచిపోయింది. ఇంజిన్లోకి నీరు చేరి రెండుకార్లు అడ్డంగా ఆగిపోవడంతో లక్డీకపూల్ వరకూ ట్రాఫిక్ స్తంభించింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చదవండి: