హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరు వాన(hyderabad rains) కురుస్తోంది. నగరంలోని పలు కాలనీల్లో వరద నీరు చేరింది. అంబర్‌పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహిదీపట్నం, మీర్‌పేట, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, అబిడ్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముసారాంబాగ్ వంతెన పైనుంచి మూసీ నీరు ప్రవహిస్తోంది.
నగరంలో వాన
ఖైరతాబాద్‌లో చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ పాతబస్తీ యాకుత్పురా ప్రాంతంలో వాన కురుస్తోంది. రహదారులపై వాన నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. నగరంలోని పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అతిభారీ వర్షాలు
రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం, షేర్ జోన్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. రాగల 5 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వివరించారు.