హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ఎఫ్టీఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా... రాత్రి 8 గంటల వరకు 513.55 మీటర్లకు చేరింది. ముందస్తుగా రెండు అలుగులు, ఒక తూము ద్వారా నీటిని బయటకు వదులుతున్నారు. అలుగులు, తూముకు అడ్డుపడుతున్న చెత్తా చెదారాన్ని క్లిన్ టెక్ మిషన్, సిబ్బందితో ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.
స్తంభించిన భాగ్యనగరం... హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద - hyderabad weather news
రాజధానిలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హుస్సేన్ సాగర్ లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ముందస్తుగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు
జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెండు రోజుల్లో వర్షానికి సంబంధించి జీహెచ్ఎంసీకి 161 విజ్ఞాపనలు అందాయని ఆయన తెలిపారు. వీటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించినట్టు చెప్పారు. మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.