రాష్ట్రంలో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు - వాతావరణ శాఖ
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఏపీలోని కాకినాడ వద్ద తీవ్ర వాయుగుండంగా తీరం దాటిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది వాయుగుండంగా బలహీనపడిందని రాగల 12 గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మంగళ, బుధవారం విస్తారంగా వర్షాలతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఈ రోజు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతనిధి ముఖాముఖి...
రాష్ట్రంలో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు