తెలంగాణ

telangana

ETV Bharat / state

బిగ్​ అలెర్ట్​.. రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు - తెలంగాణ వర్షాల వార్తలు

బిగ్​ అలెర్ట్​.. రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు
బిగ్​ అలెర్ట్​.. రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు

By

Published : Jul 26, 2022, 1:05 PM IST

Updated : Jul 26, 2022, 1:33 PM IST

13:02 July 26

బిగ్​ అలెర్ట్​.. రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు

రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో భారీ వానలు పడతాయని వెల్లడించింది. రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. గురువారం రోజున తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది.

ఇప్పటికే గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరంలో వరణుడు దంచికొడుతున్నాడు. ఏకధాటి వానకు నగరంలోని చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

మరోవైపు.. పలు జిల్లాల్లో చెరువులు అలుగు పారుతూ రహదారులపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వంతెనల పైనుంచి నీరు పారుతున్నాయి. పలు గ్రామాల్లో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అలుగు పారుతున్న చెరువు అందాలను చూడటానికి ఆయా గ్రామాల ప్రజలు బారులు తీరుతున్నారు.

ఇవీ చూడండి..

Last Updated : Jul 26, 2022, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details