దక్షిణ అండమాన్ తీర పరిసర ప్రాంతాల్లో.. ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. విశాఖ నగరంలో భారీ ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో పెద్ద ఎత్తున వర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
తీవ్రంగా ఈదురుగాలులు..
విశాఖ బీచ్ రోడ్డు, రైల్వే స్టేషన్, జ్ఞానాపురం, అక్కయ్య పాలెం, తాటిచెట్ల పాలెంతో పాటు గాజువాక, మధురవాడల్లో ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా కనిపించింది. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా రహదారులు జలమయమయ్యాయి.
ఏజెన్సీలో విరిగిపడిన చెట్లు..