ఈ ఏడాది దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురిశాయి. గత 33 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదయింది. ఎక్కువ రోజులపాటు వర్షం కురవడం కూడా ఈ ఏడాది ఒక రికార్డు. 1988-89 సంవత్సరం నైరుతి రుతుపవనాల సమయంలో 541.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. 64 రోజుల పాటు వర్షం పడింది. 8.5 మిల్లీమీటర్ల తీవ్రత నమోదైంది. 1989-90లో 832.90 మిల్లీమీటర్ల వర్షపాతంతో 67 రోజులు వాన కొట్టింది. తీవ్రత 12.4 మిల్లీమీటర్లుగా ఉంది.1990-91లో 653.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 63 రోజులు వర్షం కురిసింది. 10.4 మిల్లీమీటర్ల తీవ్రత నమోదైంది.
2005-06లో నైరుతి రుతుపవనాల సమయంలో 808.2 మిల్లీమీటర్ల వర్షపాతంతో 67 రోజులు వర్షం పడింది. తీవ్రత 8.8 మిల్లీమీటర్లుగా ఉంది. 2010-11 సంవత్సరంలో 894.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఏకంగా 81 రోజుల పాటు వర్షం పడగా... 11.0 మిల్లీమీటర్ల తీవ్రత నమోదైంది. మరుసటి ఏడాదికొచ్చేసరికి 601.2 మిల్లీమీటర్ల వర్షపాతంతో 65 రోజులు మాత్రమే వర్షం పడింది. తీవ్రత 9.2 మిల్లీమీటర్లుగా ఉంది.