హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వాన కురవడం వల్ల భాగ్యనగర వాసులు తడిసిముద్దయ్యారు. ఆకాశమంంతా ఒకేసారి మేఘావృతమై వాన కురిసింది. మరోపక్క లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరుకుని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
హైదరాబాద్‌లో వర్షం.. వాహనదారులకు తప్పని తిప్పలు - hyderabad weather update news
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమవ్వగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఏకధాటిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
హైదరాబాద్‌లో వర్షం.. వాహనదారులకు తప్పని తిప్పలు
నగరంలోని కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, సైఫాబాద్, లక్డీకాపూల్, బషీర్‌బాగ్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపైకి నీరు చేరడం వల్ల వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.
ఇదీ చదవండిఃపొంగిపొర్లుతున్న డ్రైనేజీలు... పట్టించుకోని ప్రజాప్రతినిధులు