ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు (Heavy Rainfall Alert) పడుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలను జోరువాన (Heavy Rainfall Alert) ముంచెత్తుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గంటనుంచి వర్షం ఎడ తెరపిలేకుండా కురిసింది. హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. బహదూర్‌పురా నుంచి కిషన్‌బాగ్ వెళ్లే దారిని వరదనీరు (rain flood) ముంచెత్తింది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో పాదచారులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముషీరాబాద్, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, రామ్‌నగర్, కవాడిగూడ, ఇందిరాపార్క్ ప్రాంతాల్లో వర్షం (Heavy Rainfall Alert) కురుస్తూనే ఉంది.
దోమలగూడ, విద్యానగర్, అడిక్‌మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rainfall Alert) కురుస్తోంది. ఛత్రినాక కందికల్ గేట్ వెళ్లే రహదారిలో భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. యకుత్‌పురాలో నాలా పొంగటంతో రోడ్‌పై నీరు భారీగా చేరింది. చంద్రాయణ్‌గుట్ట నుంచి హష్మబాద్ వెళ్లే దారిలో వాహనాలు నీటిలో ఆగిపోయాయి.