హైదరాబాద్లోని మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లడం వల్ల మురుగునీరు రోడ్లపై ఏరులై పారింది. భారీగా వరదనీరు నిలవడం వల్ల ద్విచక్ర వాహనాలు, కార్లు సగం వరకు మునిగాయి. ట్రాఫిక్ పోలీసులు గొడుగుల సహాయంతో విధులు నిర్వర్తిస్తూ వాహనదారులకు సహకారం అందించారు.
భాగ్యనగరంలో భారీ వర్షం.. నీట మునిగిన వాహనాలు - ఈరోజు సాయంత్రం కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరం
ఈరోజు సాయంత్రం కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరం తడిచిముద్దయింది. మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షపునీరు ప్రధాన రహదారులపై వచ్చి చెరువులను తలపించాయి.
![భాగ్యనగరంలో భారీ వర్షం.. నీట మునిగిన వాహనాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4733711-719-4733711-1570895676956.jpg)
భారీ వర్షం.. నీట మునిగిన వాహనాలు