Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కోఠి, కింగ్ కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్ నారాయణగూడ, లిబర్టీ, ముషీరాబాద్, రాంనగర్, విద్యానగర్, గాంధీనగర్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, అడిక్‌మెట్, కవాడిగూడ, దోమలగూడ, బాగ్‌లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ, వారాసిగూడ, పారడైజ్, బన్సిలాల్ పేట్, రాంగోపాల్ పేట్ డివిజన్ ప్రాంతంలో వడగండ్ల వాన దంచికొట్టింది. కుత్బుల్లాపూర్, సూరారం, దూలపల్లి, జీడిమెట్లలో జోరు వాన కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రహదారుల పైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 3 గంటల వరకు బన్సీలాల్‌పేటలో 3.1 సెం.మీ, చిలకలగూడలో 2.9 సెం.మీ, గొల్కొండలో 2.7 సెం.మీ, మోండమార్కెట్లో 2.7 సెం.మీ, ఓయూలో 2.1 సెం.మీ, రామంతాపూర్‌లో 2.0 సెం.మీ, వర్షపాతం నమోదైంది.