Hyderabad Rains Today: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. గరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. వానహోరుతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, ట్రూప్ బజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, నారాయణగూడ, హైదర్‌గూడ, ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
హిమాయత్‌నగర్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, రాంనగర్, దోమలగూడ, బోలక్‌పూర్, కవాడిగూడ ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. గాంధీనగర్, జవహర్‌నగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్‌నగర్ ఆర్టీసీ క్రాస్‌రోడ్, ముషీరాబాద్ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రహదారుల పైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
రాష్ట్రంలో ఈరోజు , రేపు అక్కడక్కడ భారీ వర్షాలు:రాష్ట్రంలో ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి,.. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 7 సెంమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.