Hyderabad Rains Today: హైదరాబాద్‌లో వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. వాన హోరుతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అసెంబ్లీ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది.
ట్యాంక్‌బండ్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, మూసాపేట, ప్రగతినగర్, నిజాంపేట ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరద నీరు రహదారులపైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు.
రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు:రాష్ట్రంలోరాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి ఉన్న తూర్పు-పశ్చిమ ద్రోణి ఈ రోజు బలహీన పడినట్లు పేర్కొంది.