తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖలో ఎడతెరిపిలేని వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం - విశాఖలో కొండచరియ విరిగిపడి తల్లీబిడ్డ మృతి

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఏపీ విశాఖలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాజువాకలోని హరిజన జగ్గయ్య పాలెం, మిలిటరీ కాలనీ ప్రాంతాలు నీట మునిగాయి. గాజువాక సింధియా గణపతినగర్‌లోని ఓ ఇంటిపై కొండచరియ విరిగిపడి తల్లీ బిడ్డ మృతి చెందారు.

విశాఖలో ఎడతెరిపిలేని వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం
విశాఖలో ఎడతెరిపిలేని వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం

By

Published : Oct 12, 2020, 10:40 AM IST

ఏపీ విశాఖలో భారీగా ఈదురుగాలు, ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. గాజువాకలోని మిలిటరీ కాలనీ, హరిజనజగ్గయ్యపాలెం నీటమునిగింది. గాజువాక షీలానగర్ మధ్య పలు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. సింధియా గణపతి నగర్‌లో ఓ ఇంటిపై కొండచరియ విరిగిపడి తల్లీబిడ్డ మృతి చెందారు. రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేస్తున్నారు. అధికారులతో కలెక్టర్‌ వినయ్‌చంద్ ఫోనులో మాట్లాడారు.

కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నం. 0891–2590102, 0891-2590100లను ఏర్పాటు చేశారు. ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తీర ప్రాంత మండలాల్లోని అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని తెలిపారు. రోడ్లపై చెట్లు పడిన వెంటనే తొలగింపునకు అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు.

ఇదీ చదవండి :ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం ముప్పు

ABOUT THE AUTHOR

...view details