బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వరుణుడు జంటనగరాలను ముంచెత్తాడు. ఉదయం నుంచి ఏకధాటిగా కురిసిన కుంభవృష్టి వర్షంతో రికార్డుస్థాయిలో గణాంకాలు నమోదయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి.
జంటనగరాల్లో పాత రికార్డులు బద్ధలు - రాజధాని నగరంలో కుంభవృష్టి
వాయుగుండం ప్రభావంతో జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. నగర ప్రజానీకం జడివానలో తడిసి ముద్దయ్యారు. ఉదయం నుంచి ఏకధాటిగా కురవడంతో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రాజధానిలోని పలు లోతట్టు ప్రాంతాలు జలసంద్రంలో చిక్కుకున్నాయి.
జంటనగరాల్లో పాత రికార్డులు బద్ధలు
ఘట్‌కేసర్ సింగపూర్ టౌన్‌షిప్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్లకు పైగా భారీస్థాయిలో గణాంకాలు నమోదయ్యాయి. రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో 25.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.
సంఖ్య | ప్రాంతం | వర్షపాతం(సెంమీ) |
1 | ఘట్‌కేసర్ సింగపూర్ టౌన్‌షిప్ | 31.9 |
2 | హయత్‌నగర్ | 29.13 |
3 | హస్తినాపురం | 27.93 |
4 | అబ్దుల్లాపూర్‌మెట్ | 26.15 |
5 | ఇబ్రహీంపట్నం | 25.35 |
6 | సరూర్‌నగర్ | 26.78 |
7 | ఉప్పల్ | 24.8 |
8 | దండుమైలారం | 24.4 |
9 | మేడిపల్లి | 23.2 |
10 | కీసర | 25.6 |
11 | ముషీరాబాద్ | 24.5 |
12 | చార్మినార్ | 21.6 |
13 | మల్కాజ్‌గిరి | 21.6 |
14 | సికింద్రాబాద్ | 21.5 |
15 | వలిగొండ | 25.5 |