హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై ఉధృతంగా నీరు ప్రవహించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. దుద్‌బౌలి, రహమత్‌నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, చందానగర్, పాత బస్తీ, సిటీ కళాశాల, బహదూరపుర, జూపార్కు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, హైదర్‌నగర్, కృష్ణానగర్, అమీర్‌పేట, ఆల్విన్ కాలనీ, దుద్‌బౌలి, రహమత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ఈఎస్‌ఐ ఆసుపత్రి వద్ద వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సకాలంలో స్పందించకపోవటం వల్ల ప్రజల్లో అసహనం కలిగింది.
భాగ్యనగరంలో భారీవర్షం... రోడ్లు జలమయం - SR Nagar Rain
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీవర్షం కురిసింది. ఈఎస్‌ఐ ఆస్పత్రి ఎదుట భారీగా వరదనీరు వచ్చి చేరటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నగరంలో భారీ వర్షం... జలమయమైన రోడ్లు