తెలంగాణ

telangana

ETV Bharat / state

సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం... రోడ్లన్నీ జలమయం - సికింద్రాబాద్​లో వర్షం

సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా... చల్లటి వాతావరణం నెలకొంది. వర్షం కారణంగా రోడ్లపై నీరు చేరటం వల్ల నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

heavy rain in secundrabad  and roads fill with water
heavy rain in secundrabad and roads fill with water

By

Published : Jul 8, 2020, 5:09 PM IST

ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బోయిన్​పల్లి, అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యారడైస్, బేగంపేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా... చల్లటి వాతావరణం నెలకొంది. వర్షం కురవటం వల్ల పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వర్ష ప్రభావం వల్ల రోడ్లపై నీరు చేరటం వల్ల నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ఇవీచూడండి:పత్తికి 'తెలంగాణ బ్రాండ్‌'!.. మార్కెటింగ్ శాఖ కసరత్తు

ABOUT THE AUTHOR

...view details