హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, బాలానగర్, చింతల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కుత్బుల్లాపూర్, మాదాపూర్, కొండాపూర్, మణికొండ, గచ్చిబౌలి, రాయదుర్గం, లంగర్‌హౌస్, గోల్కొండ, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, కార్వాన్, బహదూర్‌పురా, దూద్‌బౌలి, గౌలిపుర ప్రాంతాల్లో వాన పడింది.
బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
వర్షం కారణంగా రహదారులపైకి నీరు చేరింది. వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
మూడు రోజులు విస్తారంగా వర్షాలు..
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్రా, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడిందని వివరించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి వానలు కురుస్తాయని తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి: SMITA SABHARWAL: వర్షంలో తడుస్తూ మురిసిపోయిన మహిళా అధికారులు