తెలంగాణ

telangana

ETV Bharat / state

Rain in Hyderabad: హైదరాబాద్​లో రాత్రి పలుచోట్ల జోరుగా వర్షం... - Hyderabad weather report

Rain in Hyderabad: సంక్రాంతి సంబురాలు జరుపుకుని ఆనందంగా ఉన్న హైదరాబాద్‌ వాసులను... వరుణుడు పలకరించాడు. నగరంలోని పలుచోట్ల వాతావారణం చల్లగా మారి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జోరుగా కురిసిన వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. అక్కడక్కడా రోడ్లపైకి వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Rain
Rain

By

Published : Jan 16, 2022, 5:36 AM IST

Rain in Hyderabad: రెండు మూడ్రోజులుగా మేఘావృతమై ఉన్న హైదరాబాద్‌ వాతావరణం ఒక్కసారిగా ఈదురుగాలులతో మరింత చల్లగా మారింది. రాత్రి పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురవగా... ఏకధాటిగా కురిసిన వానకు నగరంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి. భాగ్యనగర శివారు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రాత్రి 12 గంటల వరకు నాచారంలో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా... ఉప్పల్‌లో 9, కాప్రాలో 8.4, సరూర్‌నగర్ 7.7, సైదాబాద్ 5.6, మల్లాపూర్ 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రంగంలోకి విపత్తు నిర్వహణ బృందాలు..

పాతబస్తీలో కురిసిన భారీ వర్షానికి మీరాలంమండి కూరగాయల మార్కెట్ నీట మునిగింది. తార్నాకలోని పలు కాలనీల్లో రోడ్లపై నీరు ప్రవహించింది. ఉప్పల్ నుంచి మౌలాలి వరకూ ఎడతెరపి లేకుండాల వర్ష కురవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారిలో రహదారిపై నీరు చేరింది. వర్షం కురిసిన ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. వర్షం కారణంగా రోడ్లపై తలెత్తిన సమస్యలను తొలగించడానికి... జీహెచ్​ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి.

ఇదీ చదవండి:Cybercriminals new plans: పండగపూట ఆఫర్లని ఆశపడితే... హాంఫట్!!

ABOUT THE AUTHOR

...view details