గత రాత్రి కుండపోతగా కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాల్లోని కట్లేరు, ఎదుళ్ల, పడమటి, తూర్పు, గుర్రపు, కొండ, విప్లవాగులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. స్థానికంగా కురిసిన వర్షాలకు తోడు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరడంతో గంట గంటకు ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. కట్లేరు, ఎదుళ్ల వాగులు, గుర్రపువాగు, వంతెనపై నుంచి ప్రవహిస్తుండటంతో తిరువూరు మండలం చౌటపల్లి - జి. కొత్తూరు మార్గంలో, తిరువూరు - గంపలగూడెం మార్గంలో, గంపలగూడెం - వినగడప, ఎ. కొండూరు మండలం పోలిశెట్టిపాడు - మారేపల్లి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
Rains: కృష్ణా జిల్లాలో రాత్రి నుంచి మోస్తరు వర్షాలు - heavy rains
బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలోని కృష్ణాజిల్లాలో రాత్రి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి ప్రవాహిస్తున్నాయి. గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టెలేరు వంతెనపై వరద ప్రవాహం పెరిగింది.
పోలీసు, రెవెన్యూ అధికారులు రాకపోకలు నిలిపివేశారు. తిరువూరు - అక్కపాలెం, తిరువూరు - కోకిలంపాడు, తిరువూరు _మల్లెల, తిరువూరు మండలం కాకర్ల - వల్లంపట్ల, ఎ. కొండూరు మండలం రేపూడి-గొల్లమందల మార్గాల్లో ఎదుళ్ల, విప్లవ, కట్లేరు, పడమటి వాగుల వరద వంతెనలకు అనుకుని ప్రవహిస్తోంది. ఈ మార్గాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ఏకమయ్యాయి. పశ్చిమ కృష్ణా పరిధిలోని 926 చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. చెరువుల అలుగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, వాగుల ఆయకట్టులోని వేలాది ఎకరాల్లో మెట్ట, మాగాణి పంటలు వరద ముంపునకు గురయ్యాయి.
ఇదీ చదవండి:Afghanistan Students: సొంతదేశం వెళ్లలేం.. హైదరాబాద్‌ను వీడలేం