తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం! - heavy rain in hyderabad

Rain In hyderabad: హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే చెరువులన్నీ దాదాపు నిండిపోవడంతో తాజా వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. ఊహించని విధంగా కురిసిన వర్షానికి, అర్ధరాత్రి సమయంలో ఇళ్లకు వెళుతున్నవారు తడిసి ముద్దయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Slug heavy rain in hyderabad
Slug heavy rain in hyderabad

By

Published : Jul 26, 2022, 2:38 AM IST

Updated : Jul 26, 2022, 7:40 AM IST

Rain In Hyderabad: వరుణుడు భాగ్యనగర వాసులపై అర్ధరాత్రి మరోసారి ప్రతాపం చూపించాడు. నగరంలో అర్ధరాత్రి 12 గంటలు దాటాక పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, పాతబస్తీ, కోఠి, ఆబిడ్స్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ముషీరాబాద్, కాప్రా, హెచ్‌బీ కాలనీ, కుషాయిగూడ, రాయదుర్గం, ఖాజాగూడ, కొత్తపేట, ఎల్బీనగర్, హయత్‌నగర్, హిమాయత్‌నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచింది.

ఇప్పటికే చెరువులన్నీ దాదాపు నిండిపోవడంతో తాజా వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. ఊహించని విధంగా కురిసిన వర్షానికి, అర్ధరాత్రి సమయంలో ఇళ్లకు వెళుతున్నవారు తడిసి ముద్దయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం ధాటికి.. ముసారాంబాగ్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ముసారాంబాగ్​ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో పాటు మలక్​పేట వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో మలక్​పేట్​ వంతనపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్‌ పరిధి చింతల్‌కుంట వద్ద జాతీయ రహదారిపై మోకాల్లోతు నీరు నిలిచింది. కోఠిలో ఓ మోటారు బైకు వరద నీటిలో కొట్టుకుపోయింది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 26, 2022, 7:40 AM IST

ABOUT THE AUTHOR

...view details