తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం... అప్రమత్తమైన అధికారులు - హైదరాబాద్ తాజా వార్తలు

Heavy Rain in hyderabad: హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వానహదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్లపై వరదనీరు నిల్వకుండా బల్దియా సిబ్బంది చర్యలు చేపట్టారు.

భారీ వర్షం
భారీ వర్షం

By

Published : Jul 1, 2022, 10:54 PM IST

Heavy Rain in hyderabad: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పాతబస్తీ చార్మినార్, చంద్రాయణగుట్ట, బార్కస్, గోల్కొండ, కార్వాన్‌, లంగర్‌ హౌస్‌, బహదూర్‌పురా, సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌, బేగంటపేట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, లక్డీకాపూల్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మియపూర్, చందానగర్, మాదాపూర్ , చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌ జవహర్‌నగర్, ప్యాట్నీ, చంపాపేట, సైదాబాద్, కర్మన్‌ఘాట్, కవాడిగూడ, దోమలగూడ, రామ్‌నగర్, బాగ్‌లింగంపల్లి, బోలక్‌పూర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, గాంధీనగర్‌, సంతోష్‌నగర్, కంచన్‌బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వానహదారులు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వరదనీరు నిల్వకుండా బల్దియా సిబ్బంది చర్యలు చేపట్టారు. వరదనీరు చేరే ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details