వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండురోజులుగా జనజీవనం స్తంభించింది. భారీ వరదనీటితో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయమై... వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భాగ్యనగరంలో భారీ వర్షం... స్తంభించిన జనజీవనం
రాష్ట్రంలో వరుణుడి ప్రభావం తగ్గట్లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదనీటితో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
కోఠి, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో రహదారులపైకి నీరుచేరటంతో... ట్రాఫిక్ నిలిచిపోయింది. హిమాయత్ నగర్‌లో మోకాళ్ల లోతు వర్షం నీరు నిలిచిపోయింది. ఎల్బీనగర్ పరిధిలోని కాలనీల్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పర్యటించారు. జోరువానల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భారీ వర్షాలకు నగరశివారులోని హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 1,762 అడుగులకు చేరింది. వాతావరణశాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇదీ చూడండి:సముద్రాన్ని తలపిస్తున్న భాగ్యనగరం.. రాకపోకలకు ఆటంకం