హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానతో నగరమంతా తడిసి ముద్దయింది. సైదాబాద్, సరూర్‌నగర్, చంపాపేట, సంతోష్ నగర్, దిల్‌షుఖ్‌నగర్, అంబర్‌పేట్, కాచిగూడ, నల్లకుంట, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, కుషాయిగూడ, ఏఎస్‌రావు నగర్, చర్లపల్లిలో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది.
భాగ్యనగరంలో ఉదయం నుంచి భారీ వర్షం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం తడిసిముద్దైంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ఎడతెరిపిలేని వర్షం... నగర వాసులను చేస్తోంది అతలాకుతలం
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, లక్డీకాపూల్, నాంపల్లి, ఖైరతాబాద్, అబిడ్స్, బషీర్‌బాగ్, సుల్తాన్ బజార్, కోఠి, బేగంబజార్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతవరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇదీ చూడండి:పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగండం