బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం నుంచి దట్టమైన మేఘాలు కమ్ముకోగా... పలుచోట్లు దాదాపు గంటపాటు భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, సుచిత్ర, షాపూర్‌నగర్ ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడగా.... బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, ఈఎస్ఐ, ఎస్సార్ నగర్, అమీర్ పేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, జేబీఎస్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి... రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. గంట సేపటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
భాగ్యనగరంలో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం... - ఎల్బీనగర్
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. వాన నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీరు రహదారులపై ప్రవహిస్తూ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాలైతే... చెరువులను తలపించాయి. చిన్న వానకే తడిసి ముద్దయ్యే భాగ్యనగరం... గంటపాటు కురిసిన భారీ వర్షానికి జలమయమైంది.
ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్ ప్రాంతాలలో అరగంట పాటు వర్షం కురిసింది. లంగర్‌హౌస్, కార్వాన్, గోల్కొండలో మోస్తరు జల్లులు కురిశాయి. మాదాపూర్, కొండాపుర్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. శేరిలింగంపల్లి పరిధిలోని చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వానకు రోడ్లు చెరువులను తలపించాయి. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, మూసాపేట్‌లోనూ భారీ వర్షం కురిసింది. రోడ్లపై నిలిచిన నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జోరుగా వాన పడింది.
ఇవీ చూడండి: కారుజోరు: హుజూర్నగర్ తోటలో గులాబీ వికాసం