హైదరాబాద్ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఎల్బీ నగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడా, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, తిరుమలగిరి, ఫ్యాట్నీ, బేగంపేట, కూకట్ పల్లిలో భారీ వర్షం కురిసింది.
RAIN: జంట నగరాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..
15:13 June 27
RAIN: జంట నగరాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..
పాతబస్తీ చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, హబ్సిగూడా, నాచారం మల్లాపూర్ ప్రాంతాల్లోనూ ఓ మాదిరి వాన కురిసింది. మేడ్చల్ జిల్లా పరిధిలో సుచిత్ర, కొంపల్లి, గాజుల రామారం, షాపూర్నగర్లోనూ జోరుగా వర్షం పడింది.
కోఠి, సుల్తాన్‌బజార్, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కింగ్ కోఠి, రాంకోటి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మియాపుర్, చందానగర్, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతాపూర్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడగా.. పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. కూకట్‌పల్లిలోని పలు కాలనీల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది.
భారీ వర్షం కారణంగా రహదారులపైకి నీరు చేరింది. పలుచోట్ల నాలాలు పొంగిపొర్లగా.. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
ఇదీ చూడండి: covid effect: రూ.2వేల కోట్లకు చేరిన మెట్రో నష్టాలు