భాగ్యనగరం ఒక్కసారిగా కుండపోత వర్షానికి అతలాకుతలమైంది. రాజేంద్రనగర్లోని అత్తాపూర్, ఆరాంఘర్, శివరాంపల్లి, మణికొండ, పుప్పాలగూడ, హైదర్షాకోట్, బద్వేల్ ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా రోడ్లపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
భాగ్యనగరంలో కుండపోత వర్షం.. చెరువులను తలపించిన రోడ్లు - heavy rain localities flooded in hyderabad
హైదరాబాద్‌లో జోరుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపిలేని వానలకు లోతట్టు ప్రాంతాలు నీటమునగగా.. రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు, కాలనీలు, బస్తీలు... వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. పలు చోట్ల వాహనాలు నీటమునిగాయి.
భాగ్యనగరంలో కుండపోత వర్షం.. చెరువులను తలపించిన రోడ్లు
అత్తాపూర్ డీమార్ట్ వద్ద మూడు కార్లు, డీసీఎం, ఒక బస్సు, 15 ద్విచక్ర వాహనాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.
ఇదీ చూడండి :భారీ వర్షాలు... జలమయమైన లోతట్టు ప్రాంతాలు
Last Updated : Sep 17, 2020, 9:44 AM IST