తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్​లో భారీ వర్షం కురిసింది. ఎటు చూసినా నీరే కనిపించేంతగా వాన కొట్టింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

rain in hyderabad
నగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

By

Published : Sep 19, 2020, 3:16 PM IST

గత మూడురోజులుగా కురుస్తున్న వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. బేగంబజార్, ఎంజె మార్కెట్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్​నగర్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, ఎస్‌ఆర్​నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట కూకట్​పల్లి, ఎల్బీనగర్​, హయత్​నగర్​, అబ్దుల్లాపూర్​మెట్​ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మల్కాజిగిరి, నేరెడ్​మేట్, కుషాయిగూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది.

రాష్ట్రంలో మరో 3 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇవాళ, రేపు, ఎల్లుండి అనేక చోట్ల వర్షాలు కురిస్తాయని తెలిపింది.

హైదరాబాద్​లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

ఇదీ చూడండి:దంచికొట్టిన వానలు.. పలుచోట్ల తెగిన కుంటలు, రోడ్లు

ABOUT THE AUTHOR

...view details