రుతు పవనాల ప్రభావంతో రాజధానిలో పలుచోట్ల చిరుజల్లుల నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, మారేడుపల్లి, బేగంపేట, ప్యాట్నీ, ప్యారడైజ్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు గంటసేపు కురిసిన వర్షంతో రోడ్లపై నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతుండడం వల్ల వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం... - హైదరాబాద్‌లో వర్షం
భాగ్యనగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సికింద్రాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం...