తెలంగాణ

telangana

ETV Bharat / state

Rain in hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. పెద్దఎత్తున స్తంభించిన ట్రాఫిక్ - several parts of the capital city

Rain in hyderabad: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. నగరంలోని ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్‌పేటలో వర్షం కురిసింది. ఒక్కసారిగా వరుణుడు రావడంతో భారీగా ట్రాఫిక్​ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Rain in hyderabad
Rain in hyderabad

By

Published : Jul 31, 2022, 8:37 PM IST

Updated : Jul 31, 2022, 10:24 PM IST

Rain in hyderabad: రాజధాని నగరంలో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్‌పేట, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్ ప్రాంతాల్లో వరుణుడి రాకతో వాహనదారులు తడిసి ముద్దయ్యారు. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. మియాపూర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, మెహదీపట్నం, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, బేగంపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత కొన్ని రోజుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా.. ఇవాళ మరోసారి కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నగరంలోని కవాడిగూడ, దోమలగూడ, భోలక్‌పూర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్, జవహర్‌నగర్, గాంధీనగర్, చాదర్​ఘాట్, మలక్​పేట్, దిల్​సుఖ్​నగర్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం(rains in hyderabad) పడింది. రాజేంద్రనగర్, కిస్మత్‌పూరా, బండ్లగూడ జాగీర్‌, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండ, అత్తాపూర్‌లోనూ వరుణుడు దంచికొట్టాడు. పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి రహదారులపై చేరిన వర్షం నీటిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటం కూడా ట్రాఫిక్‌ సమస్యకు మరో కారణమైంది.

భాగ్యనగరంలో భారీ వర్షం.. పెద్దఎత్తున స్తంభించిన ట్రాఫిక్

నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. అసెంబ్లీ, బషీర్ బాగ్ , బేగంబజార్, కోఠి, సుల్తాన్​ బజార్, అబిడ్స్​, నాంపల్లి, హిమాయత్​నగర్​, నారాయణ గూడ, లిబర్టీ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరుణుడి రాకతో చాలా కాలనీలు జలమయమయ్యాయి. రాజ్​భవన్​ రోడ్, ఖైరతాతాద్ , పంజాగుట్ట, ఇతర ప్రాంతాల్లో భారీగా నీరు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

రాబోయే మూడు రోజులు వర్షాలు:రాష్ట్రంలో రాగల మూడు రోజులలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా రాబోయే మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు హెచ్చరించారు. నిన్నటి ఉత్తర - దక్షిణ ద్రోణి ఈ రోజు దక్షిణ ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు. నిన్నటి దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలలో ఉన్న ఆవర్తనం ఈ రోజు బలహీన పడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:NIA at Armoor: ఆర్మూర్​లో ఎన్​ఐఏ సోదాలు.. ఒకరు అరెస్ట్​..!

అలవోకగా 'లా'.. ఒకేసారి 11 గోల్డ్​ మెడల్స్​తో పల్లవి సత్తా.. చూపు లేకపోయినా..

Last Updated : Jul 31, 2022, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details