మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది.
అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలదీ దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.