రాష్ట్రాన్ని వర్షాలు మళ్లీ ముంచెత్తుతున్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షాలు (Heavy Rains) పలు ప్రాంతాలను అతలాకుతలం చేయగా... మంగళవారం అక్కడక్కడ జల్లులు పడ్డాయి. నేడు భారీ వర్షాలు (Heavy Rain Alert) కురిసే అవకాశముందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. అల్పపీడన ప్రాంతం నుంచి ఒడిశా మీదుగా తెలంగాణ వరకూ 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో బుధవారం అక్కడక్కడ భారీగా (Heavy Rain Alert), గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మాదిరి వర్షాలు (Rain Alert) కురిశాయి. అత్యధికంగా దోమలపల్లి(నల్గొండ జిల్లా)లో 4.9, నల్గొండలో 4.8, కోహెడ(సిద్దిపేట)లో 4.3, రావినూతల(ఖమ్మం)లో 4.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంతకుముందు సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains In Telangana) కురిశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అత్యధికంగా చిట్కుల్ (మెదక్)లో 14.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.