తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వైరస్​ ఆ... అయితే మాకేంటీ..! - కరోనా... అలాంటిదేమీ లేదే...!

కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో.. ఆంధ్రప్రదేశ్​ కృష్ణా జిల్లాలోని తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మడుపల్లి చెరువు వద్ద చేపల కొనుగోలుకు ప్రజలు ఎగబడ్డారు. వైరస్ వ్యాప్తి నివారణకు కనీస జాగ్రత్త చర్యలు కూడా పాటించకపోవడం ఆందోళన కలిగించే విషయం.

Fish purchases
కరోనా వైరస్​ ఆ... అయితే మాకేంటీ..!

By

Published : Jun 6, 2020, 8:24 PM IST

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణా, ఖమ్మం జిల్లాల సరిహద్దులోని మడుపల్లి చెరువు వద్ద చేపల కొనుగోలుకు ప్రజలు ఎగబడ్డారు. భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా గుమిగూడడంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని మధిరలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం.. ఈ అనుమానానికి మరింత బలం చేకూరుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details