ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పరవాడ రాంకీ ఫార్మాసిటీలో అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో... పోలీసులు భారీగా మోహరించారు. సాల్వెంట్స్ ఫార్మా పరిసరాల్లోకి వెళ్లకుండా రహదారులు మూసివేశారు. పరిసర ప్రాంతాల్లోకి వెళ్లేందుకు యత్నించిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు.
విశాఖ రాంకీ ఫార్మాసిటీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు - visakha fire accidents news
ఏపీలోని విశాఖ పరవాడ రాంకీ ఫార్మా సిటీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్మా పరిసరాల్లోకి వెళ్లకుండా రహదారులు మూసివేశారు.
విశాఖ రాంకీ ఫార్మాసిటీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని సాల్వెంట్స్ సంస్థలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించగా.. దాదాపు 5 గంటలపాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు. అగ్ని ప్రమాదంపై చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.