రాష్ట్రంలో ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత మూడు నెలల్లో దాదాపు రూ. 5,400 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ. 900 కోట్లు అధికంగా లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత మార్చిలో అమ్మకాలు కొంత తగ్గడం అబ్కారీ శాఖను విస్మయానికి గురి చేస్తోంది.
హైదరాబాద్లోనే అధికం
రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా మందుబాబులు మద్యం సేవించారు. మూడు నెలల కాలంలో హైదరాబాద్లో రూ. 628 కోట్లు, రంగారెడ్డి రూ. 687 కోట్లు, మేడ్చల్లో రూ. 582 కోట్ల మేర లిక్కర్ విక్రయాలు జరిగాయి.