Heavy Floods in Musi River :ఉపరితల ద్రోణి ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఆరు గేట్లను.. రెండు అడుగుల మేర ఎత్తి సుమారు 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నగరంలో మూసీనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జియాగూడ వద్ద మరింత వేగంగా ప్రవహిస్తోంది.
Hyderabad Floods 2023 : హైదరాబాద్‌పై వర్షం ఎఫెక్ట్.. ఇప్పటికీ జలదిగ్బంధంలోనే పలు కాలనీలు
జియాగూడ-పురానాపుల్ను కలిపే 100 ఫీట్ల రహదారిపై రెండడుగుల మేర నీరు చేరడంతో పోలీసులు వాహన రాకపోకలను నిలిపివేశారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి అటువైపు ఎవ్వరినీ రాకుండా పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. వరద ప్రవాహం మరింత పెరిగితే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారిని.. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్దంగా ఉన్నారు.
Vinayakanagar Colony Submerged in Medchal : చెరువు నిండిందని నీళ్లు వదిలారు.. పక్కనే కాలనీ ఉన్న సంగతి మరిచారు..
Hyderabad Rains :మూసీ వరద ఉద్ధృతి పెరగడంతో.. మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలను నిలిపేశారు. ప్రవాహ తీవ్రతను బట్టి రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. మూసీ పక్కన ఉన్న పురానాపుల్ శ్మశానవాటికలోకి భారీగా నీరు చేరింది. అంత్యక్రియలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూసీ పరివాహకంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఖైరతాబాద్ పెద్ద గణేష్ ఎదురుగా ఉన్న ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లోని పలు కాలనీలలో మోకాళ్ల లోతు నీరు నిలవడంతో.. స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Telangana Rains :హైదరాబాద్‌లో విస్తారంగా కురిసిన వర్షాలతో జంట జలాశయాలకు పెద్ద స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్‌లో.. 1763 అడుగుల వరకు నీటి నిల్వ ఉండగా.. ఎగువ నుంచి 4 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి 4వేల 120 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు.
ఇక ఉస్మాన్ సాగర్‌లోనూ ప్రస్తుత నీటి మట్టం 1790 అడుగులు ఉండగా.. ఎగువ నుంచి 2వేల 200 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆరుగేట్లు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో.. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్, పోలీసు అధికారులు మూసీ పరవాహక ప్రాంతంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
Huge Floods To Telangana Projects : తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ.. గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు విడుదల