తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి భారీ వరద... పది గేట్లు ఎత్తివేత - pulichinthala project news

శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదకు తోడు, స్థానికంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నీటికుండను తలపిస్తోంది. కాగా... జలాశయం పది గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి భారీ వరద... పది గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయానికి భారీ వరద... పది గేట్లు ఎత్తివేత

By

Published : Sep 27, 2020, 9:53 AM IST

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం 10 గేట్లు ఎత్తి 4 లక్షల 75 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ దృశ్యాలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. కృష్ణానది ప్రవాహం, గేట్లు ద్వారా నీరు నాగార్జున సాగర్​కు పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

పులిచింతలకు వరద..13 గేట్లు ఎత్తివేత

పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జలాశయం ఇన్‌ఫ్లో 4.10 లక్షల క్యూసెక్కులు కాగా... ఔట్‌ఫ్లో 3.98 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 44 టీఎంసీలు కాగా...పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ఆనకట్ట 13 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.

ఇదీ చదవండి:ఎన్నికలకు ముందే కొత్త చట్టం...పారదర్శకతే ప్రధాన లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details