ఆంధ్రప్రదేశ్లోని పులిచింతల జలాశయానికి ఎగువ నుంచి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. పులిచింతల జలాశయం ఇన్‌ఫ్లో లక్షా 9 వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 6 గేట్లు ఎత్తి.. లక్షా 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పులిచింతల నుంచి విద్యుదుత్పత్తికి 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
పులిచింతలకు వరద ఉద్ధృతి.. 6 గేట్లు ఎత్తి నీటి విడుదల
ఆంధ్రప్రదేశ్లోని పులిచింతల జలాశయం వద్ద వరద ఉద్ధృతి పెరిగింది. జలాశయం 6 గేట్లు ఎత్తి లక్షా 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.
పులిచింతలకు వరద ఉద్ధృతి.. 6 గేట్లు ఎత్తి నీటి విడుదల
పులిచింతల జలాశయం నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు ఉండగా..ప్రస్తుత నీటినిల్వ 45 టీఎంసీలుగా ఉంది.
ఇదీ చదవండి:ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతగా గురుకుల పరీక్ష