ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో వరద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో మండలంలోని కొత్తూరు కాజ్ వే వద్ద నాలుగు అడుగులు మేర వరద నీరు చేరుకుంది. ఫలితంగా 19 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
గోదావరికి భారీ వరద.. 19గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు - గోదావరి వరద
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి నదికి భారీగా వరద వస్తోంది. పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్వే వద్ద నాలుగు అడుగుల మేర వరద నీరు చేరుకుంది. ఫలితంగా నదీ పరివాహకంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
గోదావరి నదికి భారీ వరద.. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం
మహా నందీశ్వర ఆలయం వద్ద కాపర్ డ్యామ్ గట్టుకు గండి పడింది. అర్థరాత్రి వరకు నదిలో ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్