తెలంగాణ

telangana

Lockdown Rules: రెండు వారాల్లో... మూడున్నర లక్షల ఉల్లంఘనలు

By

Published : Jun 5, 2021, 5:13 AM IST

కరోనా నియంత్రిచడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ (Lockdown)లు విధిస్తుంటే... కొందరు ఆకతాయిలు మాత్రం యథేచ్ఛగా నిబంధనలు (Rules)ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా బయటతిరిగేస్తున్నారు. కేవలం రెండు వారాల్లోనే నిబంధనలు ఉల్లంఘించిన కేసులు మూడున్నర లక్షలు దాటాయంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కొందరి నిర్లక్ష్యంలో మాత్రం మార్పు కనిపించడం లేదు.

fines
మూడున్నర లక్షల ఉల్లంఘనలు

కొవిడ్‌ (Covid) మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. అడ్డూ అదుపు లేకుండా విజృంభిస్తోన్న కరోనాను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. జనసంచారం ఎక్కువగా ఉండకూడదని లాక్‌డౌన్‌ విధించినప్పటికీ సరైన కారణాలు లేకుండా బయటకు వచ్చి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. ఇటువంటి వారిని నియంత్రించేందుకు ప్రభుత్వం జరిమానాలు (Fines) విధిస్తున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. నిబంధనలు అతిక్రమిస్తూ జరిమానాలు చెల్లిస్తున్న వారి సంఖ్య రోజుకు 18 వేలకు పైగా ఉంటుంన్నాయంటే పరిస్థితికి అద్దం పడుతోంది.

అనవసరంగా...

బయటకు వస్తే వైరస్‌ సోకుతుందని తెలిసినా... కొందరు ఆకతాయిలు అవసరం లేకున్నా బయట తిరుగుతూ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. లాక్‌డౌన్‌ విధించిన మే 12 నుంచి 30 వరకు రోజుకు 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 3 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా రూ. 5.31 కోట్ల జరిమానా విధించారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘించి రాత్రి పూట బయట తిరిగిన వారి సంఖ్య 2లక్షల 26వేలకు పైగానే ఉంది.

లక్షకు చేరువలో...

ఇక మాస్కులు ధరించని వారిపై పెట్టిన కేసులు సుమారు లక్షకు చేరువలో ఉన్నాయి. భౌతిక దూరం పాటించని 21 వేల701 మంది అధికారులు జరిమానా విధించారు. బహిరంగంగా మద్యం సేవించిన 1,604 మంది మందుబాబులు పరిహారం చెల్లించుకున్నారు. ఇలా మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 3 లక్షల 51 వేల 398.

ఇదీ చూడండి: Suicide : ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details